మాటు మాటు మాటులోనే దాచడాలు ఎందుకో
నాలోపలున్నదేది పెదవి దాటదేమిటో
నాకున్న ఆశ నీకు తెెలిపితే అదింకెటో
చాటు చాటు చాటునుంచి చూడడాలు దేనికో
మాటు మాటు మాటులోనే దాచడాలు ఎందుకో
నీ దారి వెంట నన్ను నడుపుతున్నదెవ్వడో
నా దారిలోకి నిన్ను మలచడం అదెప్పుడో
ఎపుడో తెలుసు ఈ నేలకి అపుడే తెలుసోయ్ ఆ గాలికి
విషయం తెలుసోయ్ గోదారికీ సలహా ఇవవే నీకెంతకీ
మాటకోసారి నీ పేరునే పలికినా చీమ కాటైనా లేదు నీ చెవులకి
పూటకోసారి నీ తీరునే తలిచినా చిన్న గాటైనా రాదు నీ మనసుకి
కాలం వెలుగులో లోకం తెలిపితే బతుకిలా గడిచిపోతుందే
మౌనం ముసుగులో ప్రాణం పలికితే నిజమెలా అడుగు వేస్తాదే
నిన్ననో నేడనో రేపనో మాపనో గీత గీయాలి ఏనాటికో
ఔననో కాదనో ఉందనో లేదనో తేల్చుకోవాలిగా ఏదో నీతో
నీటినైనా ఆపుతాను దాహమాపలేనుగా
ఊపిరైనా ఆపుతాను ఊహనాపలేనుగా
మేఘాలు ఆపలేవు మెరుపుకున్న తొందర
మౌనాలు ఆగమన్నా మనసు ఆగలేదురా
చాటు చాటు చాటునుంచి చూడడాలు దేనికో
మాటు మాటు మాటులోనే దాచడాలు ఎందుకో
కాలాలు ఆపలేవు క్షణముకున్న తొందర
నా కళ్ళు ఆగమన్నా కలలు ఆగలేవురా
Movie: పురుషః
Music: శ్రవణ్ భరద్వాజ్
Singer: చిన్మయి శ్రీపాద
