Pages

Search This Blog

Sunday, April 12, 2020

Song

పొద్దే రాని లోకం నీది నిద్రే లేని మైకం నీది
పాపం ఏ లాలి పాడాలి జాబిలి
ఐనా ఏ జోల వింటుంది నీ మది
వేకువనైనా వెన్నెలనైనా చూడని కళ్ళే తెరిచేలా ఇలా....
నిను లాలించేదా లేలెమ్మని
మిత్రమా మిత్రమా మైకమే లోకమా
మెల్లగా చల్లగా మేలుకో నేస్తమా

ఎన్నో రుచులుగల బ్రతుకుంది.. 
ఎన్నో ఋతువులతో పిలిచింది
చేదొక్కటే నీకు తెలిసున్నది
రేయొక్కటే నువ్వు చూస్తున్నది
ఉదయాలనే వెలివేస్తానంటావా
కలకాలమూ కలలోనే ఉంటావా
నిత్యమూ నిప్పునే తాగినా తీరని
నీ దాహం తీర్చే కన్నీరిది
మిత్రమా మిత్రమా మైకమే లోకమా 
మిత్రమా మిత్రమా శూన్యమే స్వర్గమా

నీలో చూడు మంచి మనసుంది
ఏదోనాడు మంచు విడుతుంది
వాల్మీకిలో ఋషి ఉదయించినా
వేమన్నలో భోగి నిదురించినా
మదిలో ఇలా రగలాలి ఓ జ్వాల
మలినాలనే మసి చేస్తూ మండేలా 
అగ్నిలో కాలినా స్వర్ణమై తేలగా 
నిను తాకిందేమో ఈ వేదన
మిత్రమా మిత్రమా మట్టిలో రత్నమా
మిత్రమా మిత్రమా మబ్బులో చంద్రమా 

పొద్దే రాని లోకం నీది నిద్రే లేని మైకం నీది
పాపం ఏ లాలి పాడాలి జాబిలి
ఐనా ఏ జోల వింటుంది నీ మది

No comments: