కలిసిన చేతుల్లో... పరవశమో మాయ..
పెరిగే స్నేహంలో... పరిమళమో మాయ
పంచిన ప్రాణంలో.. పరితపమో మాయా..
కలయిక ఓ మాయ.. పరిచయమో మాయా...
కలిసిన చేతుల్లో... పరవశమో మాయ..
పెరిగే స్నేహంలో... పరిమళమో మాయ
పంచిన ప్రాణంలో.. పరితపమో మాయా..
గడిచే కాలంలో....
గడిచే కాలంలో గతమంటె ఓ మాయ
నిలిచేటి బంధంలో నిమిషానికో మాయా..
కలయిక ఓ మాయ.. పరిచయమో మాయా...
కలిసిన చేతుల్లో... పరవశమో మాయ..
ఏమైనా ఈ పైన.. అడుగులు నీతోనే.. అలసట నీతోనే..
హాయైనా బాధైనా.. చెరిసగమౌతానే.. బ్రతుకిక నీతోనే..
జతలో సాగించే.... ఓ...ఓ...ఓ...
జతలో సాగించే.. సరదా ఓ మాయ..
సరదాలో పంచే.. సరసం ఓ మాయ
ఒకరా ఇద్దరమా.. అనిపించే మాయ
ఒకరే ముగ్గురుగా కనిపించే మాయా...
కలయిక ఓ మాయ.. పరిచయమో మాయా...
కలిసిన చేతుల్లో... పరవశమో మాయ..
లోలో.చాలా ఉన్నా.. బయటికి మాటల్లో..తెలియదు కొంతైనా
నాలో ఏ ప్రశ్నైనా... ఎదురుగా నీ ప్రేమ.. బదులుగ నిలిచేనా
అనురాగం చేసే....ఓ....ఓ...ఓ...
అనురాగం చేసే అల్లరి ఓ మాయ..
మమకారం వేసే .. మంత్రం ఓ మాయ
కలలో వెంటాడే.. కలవరమో మాయ..
నిజమై వెంటుండే ... నీ పలుకే మాయా...
కలయిక ఓ మాయ.. పరిచయమో మాయా...
కలిసిన చేతుల్లో... పరవశమో మాయ..
No comments:
Post a Comment