Pages

Search This Blog

Wednesday, April 14, 2021

Song

నాలోన నువ్వే... చేరిపోయావా..
నీ చెలిమినే... నాలో నింపావా..
Oh.. I fall in love.. నీ మాయలోనే..
Oh.. I fall in love.. తెలిసిందా...
ఉండిపోవా నువ్విలా.. రెండు కళ్ళలోపల..
గుండె చాటులో ఇలా.. తీపి ఉప్పెనే కల..
నువ్వే నాకు సొంతమై.. నా ఏకాంత మంత్రమై..
నువ్వే చూడనంతగా.. ప్రేమించాను నిన్నుగా

నాలోన నువ్వే... చేరిపోయావా..
నీ చెలిమినే... నాలో నింపావా..
Oh.. I fall in love.. నీ మాయలోనే..
Oh.. I fall in love.. తెలిసిందా...

నిన్నే నిన్నే చూస్తూ నేను ఎన్నో అనుకుంటాను 
కన్ను కన్ను కలిసే వేళ మూగైపోతాను
మధురముగా.. ప్రతీ క్షణమే...
జరగనిదే ... నేను మరువడమే..
Oh.. I'm feeling high.. నీ ప్రేమలోనే..
Oh.. I'm flying now... నీ వలనే..

ఉండిపోవా నువ్విలా.. రెండు కళ్ళలోపల..
గుండె చాటులో ఇలా.. తీపి ఉప్పెనే కల..
నువ్వే నాకు సొంతమై.. నా ఏకాంత మంత్రమై..
నువ్వే చూడనంతగా.. ప్రేమించాను నిన్నుగా

నాలోన నువ్వే... చేరిపోయావా..
నీ చెలిమినే... నాలో నింపావా..

ఎంతో ఆలోచిస్తూ ఉన్నా.. ఏమీ అర్థం కాదు..
అంతా నీవే ఐపోయాక.. నాకే నే లేను...
చిలిపితనం... తరిమినదే...
జత కలిసే.. చిరు తరుణమిదే..
Oh.. I wanna say.. నా పాటల్లోనే..
Oh.. I wanna say.. నీతోనే...

ఉండిపోవా నువ్విలా.. రెండు కళ్ళలోపల..
గుండె చాటులో ఇలా.. తీపి ఉప్పెనే కల..
నువ్వే నాకు సొంతమై.. నా ఏకాంత మంత్రమై..
నువ్వే చూడనంతగా.. ప్రేమించాను నిన్నుగా

నాలోన నువ్వే... చేరిపోయావా..
నీ చెలిమినే... నాలో నింపావా..

Sunday, March 28, 2021

Song

కలయిక ఓ మాయ.. పరిచయమో మాయా...
కలిసిన చేతుల్లో... పరవశమో మాయ..
పెరిగే స్నేహంలో... పరిమళమో మాయ 
పంచిన ప్రాణంలో.. పరితపమో మాయా..

కలయిక ఓ మాయ.. పరిచయమో మాయా...
కలిసిన చేతుల్లో... పరవశమో మాయ..
పెరిగే స్నేహంలో... పరిమళమో మాయ 
పంచిన ప్రాణంలో.. పరితపమో మాయా..

గడిచే కాలంలో.... 

గడిచే కాలంలో గతమంటె ఓ మాయ 
నిలిచేటి బంధంలో నిమిషానికో మాయా..
కలయిక ఓ మాయ.. పరిచయమో మాయా...
కలిసిన చేతుల్లో... పరవశమో మాయ..

ఏమైనా ఈ పైన.. అడుగులు నీతోనే.. అలసట నీతోనే..
హాయైనా  బాధైనా.. చెరిసగమౌతానే.. బ్రతుకిక నీతోనే..
జతలో సాగించే.... ఓ...ఓ...ఓ...
జతలో సాగించే.. సరదా ఓ మాయ..
సరదాలో పంచే.. సరసం ఓ మాయ 
ఒకరా ఇద్దరమా.. అనిపించే మాయ 
ఒకరే ముగ్గురుగా కనిపించే మాయా...

కలయిక ఓ మాయ.. పరిచయమో మాయా...
కలిసిన చేతుల్లో... పరవశమో మాయ..

లోలో.చాలా ఉన్నా.. బయటికి మాటల్లో..తెలియదు కొంతైనా 
నాలో ఏ ప్రశ్నైనా... ఎదురుగా నీ ప్రేమ.. బదులుగ నిలిచేనా 
అనురాగం చేసే....ఓ....ఓ...ఓ...
అనురాగం చేసే అల్లరి ఓ మాయ..
మమకారం వేసే .. మంత్రం ఓ మాయ 
కలలో వెంటాడే.. కలవరమో మాయ..
నిజమై వెంటుండే ... నీ పలుకే మాయా...

కలయిక ఓ మాయ.. పరిచయమో మాయా...
కలిసిన చేతుల్లో... పరవశమో మాయ..

Friday, January 15, 2021

Song

ఏ దారెదురైనా ఎటు  వెళుతుందో .... అడిగానా 
ఏం తోచని పరుగై .. ప్రవహిస్తూ..  పోతున్నా
ఏం చూస్తూ ఉన్నా .. నే వెతికానా ఏదైనా
ఊరికినే చుట్టూ .. ఏవేవో కనిపిస్తూ ఉన్నా 
కదలని ఓ శిలనే అయినా తృటిలో కరిగే కలనే అయినా
ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా
ఇల్డాగే కడదాకా ఓ ప్రశ్నై ఉంటానంటున్నా
ఏదో ఒక బదులై నను చెరపద్దని కాలాన్నడుగుతు ఉన్నా
నా వెంట పడి నువ్వెంత ఒంటరివనొద్దు
అనొద్దు దయుంచి ఎవరూ
ఇంకొన్ని జన్మాలకి సరిపడు
అనేక స్మృతుల్ని ఇతరులు ఎరుగరు
నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన
వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది 
నా ఎద లయను కుశలము అడిగిన
గుసగుస కబురుల ఘుమఘుమలెవరివి

ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా
కాలం ఇపుడే నను కనగా .... అనగనగా 
అంటూనే ఉంటా.. ఎపుడూ పూర్తవనే అవక 
తుది లేని కథ నేనుగా
గాలివాటంలాగా.. ఆగే అలవాటే లేక
కాలు నిలవదు ఏ చోటా.. నిలకడగా
ఏ చిరునామా లేక .. ఏ బదులూ పొందని లేఖ 
ఎందుకు వేస్తోందో కేక... మౌనంగా..

నా వెంట పడి నువ్వెంత ఒంటరివనొద్దు
అనొద్దు దయుంచి ఎవరూ
ఇంకొన్ని జన్మాలకి సరిపడు
అనేక స్మృతుల్ని ఇతరులు ఎరుగరు
నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన
వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది 
నా ఎద లయను కుశలము అడిగిన
గుసగుస కబురుల ఘుమఘుమలెవరివి

లోలో ఏకాంతం.. నా చుట్టూ అల్లిన లోకం 
నాకే సొంతం అంటున్నా... విన్నారా 
నేనూ నా నీడా.. ఇద్దరమే చాలంటున్నా
రాకూడదు ఇంకెవరైనా
అమ్మ ఒడిలో మొన్న.. అందని ఆశలతో నిన్న 
ఎంతో ఊరిస్తూ ఉంది.. జాబిల్లి 
అంత దూరానున్నా .. వెన్నెలగా చెంతనే ఉన్నా 
అంటూ ఊయలలూపింది... జో లాలీ...