Pages

Search This Blog

Sunday, August 30, 2020

Song

నీ జతగా నేనుండాలి నీ యెదలో నే నిండాలి
నీ కథగా నేనే మారాలి
నీ నీడై నే నడవాలి నీ నిజమై నే నిలవాలి 
నీ ఊపిరి నేనే కావాలి 

నాకే తెలియని నను చూపించి నీకై పుట్టాననిపించి
నీదాకా నను రప్పించావే
నీ సంతోషం నాకందించి నా పేరుకి అర్థం మార్చి
నేనంటే నువ్వనిపించావే

నీ జతగా నేనుండాలి నీ యెదలో నే నిండాలి
నీ కథగా నేనే మారాలి
నీ నీడై నే నడవాలి నీ నిజమై నే నిలవాలి 
నీ ఊపిరి నేనే కావాలి 

కల్లోకొస్తావనుకున్నా తెల్లార్లూ చూస్తూ కూర్చున్నా 
రాలేదే... జాడైనా లేదే..
రెప్పలబైటే  నేనున్నా అవి మూస్తే వద్దామనుకున్నా
పడుకోవే... పైగా తిడతావే..
లోకంలో లేనట్టే మైకంలో నేనుంటే వదిలేస్తావా నన్నిలా 
నీ లోకం నాకంటే ఇంకేదో ఉందంటే నమ్మే మాటలా

నీ జతగా నేనుండాలి నీ యెదలో నే నిండాలి
నీ కథగా నేనే మారాలి

తెలిసీ తెలియక వాలింది నీ నడుమొంపుల్లో నలిగింది
నా చూపు.. ఏం చేస్తాం చెప్పు..
తోచని తొందర పుడుతోంది తెగ తుంటరిగా నను నెడుతోంది
నీ వైపు.. నీదే ఆ తప్పు 
నువ్వంటే నువ్వంటూ ఏవేవో అనుకుంటూ విడిగా ఉండలేముగా
దూరంగా పొమ్మంటూ దూరాన్నే తరిమేస్తూ ఒకటవ్వాలిగా..

నీ జతగా నేనుండాలి నీ యెదలో నే నిండాలి
నీ కథగా నేనే మారాలి
నీ నీడై నే నడవాలి నీ నిజమై నే నిలవాలి 
నీ ఊపిరి నేనే కావాలి 

No comments: