Pages

Search This Blog

Friday, January 15, 2021

Song

ఏ దారెదురైనా ఎటు  వెళుతుందో .... అడిగానా 
ఏం తోచని పరుగై .. ప్రవహిస్తూ..  పోతున్నా
ఏం చూస్తూ ఉన్నా .. నే వెతికానా ఏదైనా
ఊరికినే చుట్టూ .. ఏవేవో కనిపిస్తూ ఉన్నా 
కదలని ఓ శిలనే అయినా తృటిలో కరిగే కలనే అయినా
ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా
ఇల్డాగే కడదాకా ఓ ప్రశ్నై ఉంటానంటున్నా
ఏదో ఒక బదులై నను చెరపద్దని కాలాన్నడుగుతు ఉన్నా
నా వెంట పడి నువ్వెంత ఒంటరివనొద్దు
అనొద్దు దయుంచి ఎవరూ
ఇంకొన్ని జన్మాలకి సరిపడు
అనేక స్మృతుల్ని ఇతరులు ఎరుగరు
నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన
వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది 
నా ఎద లయను కుశలము అడిగిన
గుసగుస కబురుల ఘుమఘుమలెవరివి

ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా
కాలం ఇపుడే నను కనగా .... అనగనగా 
అంటూనే ఉంటా.. ఎపుడూ పూర్తవనే అవక 
తుది లేని కథ నేనుగా
గాలివాటంలాగా.. ఆగే అలవాటే లేక
కాలు నిలవదు ఏ చోటా.. నిలకడగా
ఏ చిరునామా లేక .. ఏ బదులూ పొందని లేఖ 
ఎందుకు వేస్తోందో కేక... మౌనంగా..

నా వెంట పడి నువ్వెంత ఒంటరివనొద్దు
అనొద్దు దయుంచి ఎవరూ
ఇంకొన్ని జన్మాలకి సరిపడు
అనేక స్మృతుల్ని ఇతరులు ఎరుగరు
నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన
వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది 
నా ఎద లయను కుశలము అడిగిన
గుసగుస కబురుల ఘుమఘుమలెవరివి

లోలో ఏకాంతం.. నా చుట్టూ అల్లిన లోకం 
నాకే సొంతం అంటున్నా... విన్నారా 
నేనూ నా నీడా.. ఇద్దరమే చాలంటున్నా
రాకూడదు ఇంకెవరైనా
అమ్మ ఒడిలో మొన్న.. అందని ఆశలతో నిన్న 
ఎంతో ఊరిస్తూ ఉంది.. జాబిల్లి 
అంత దూరానున్నా .. వెన్నెలగా చెంతనే ఉన్నా 
అంటూ ఊయలలూపింది... జో లాలీ...